sonu sood: వలస కూలీలను సొంత గ్రామాలకు పంపించేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన సోనూసూద్

sonu sood on corona service

  • ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న సోనూసూద్
  • ముంబై నుంచి యూపీలోని పలు ప్రాంతాలకు పంపిన నటుడు
  • ప్రతి కూలీ తన స్వస్థలానికి చేరుకునే వరకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తా  

కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న వలస కూలీలకు సినీనటుడు సోనూసూద్ సాయం చేస్తున్నారు. ముంబైకి ఉపాధి కోసం వచ్చిన  ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులను తరలించేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని, రెండు రోజుల క్రితం ముంబై నుంచి యూపీలోని లక్నో, హర్దోయ్, ప్రతాప్‌గఢ్‌, సిద్ధార్థ్‌ నగర్‌ ప్రాంతాలకు కూలీలను పంపారు.

అంతేకాదు, ముంబై నుంచి బిహార్‌, జార్ఖండ్‌లకు కూడా ఆయన కూలీలను పంపారు. కూలీల ప్రయాణంలో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఆయన కల్పించారు. ఉపాధి కోసం వచ్చి నానా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను చూస్తుంటే తన హృదయం ద్రవిస్తోందని ఆయన చెప్పారు. సొంత గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను చూసి బాధపడ్డానని అందుకే వారికి సాయం చేస్తున్నానని ఆయన చెప్పారు. ప్రతి కూలీ తన స్వస్థలానికి చేరుకునే వరకు తాను రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూనే ఉంటానని తెలిపారు.

sonu sood
Corona Virus
Lockdown
  • Loading...

More Telugu News