men: మాస్కులంటే మగవారికి చెడ్డ చిరాకట!: అధ్యయనంలో వెల్లడి
- మాస్కులు ధరిస్తే బలహీనులుగా భావిస్తారని భయం
- కరోనా వైరస్ తమను ఏమీ చేయలేదన్న ధీమా
- మాస్కులు లేకుండా బయట తిరిగే వారిలో పురుషులే అధికం
పురుషులు మాస్కులు ధరించడంపై లండన్‌లోని మిడిలెస్సెక్స్ యూనివర్సిటీ, కాలిఫోర్నియాలోని మాథమెటికల్ సైన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లు అమెరికాలో పురుషులపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. మాస్కులు ధరించే విషయంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా అయిష్టత చూపుతారని తేలింది. మాస్కులు లేకుండా బయట తిరిగే వారిలో పురుషులే అధికమని పేర్కొంది. మాస్కులు ధరిస్తే తమను బలహీనులుగా ఎక్కడ అంచనా వేస్తారోనన్న భయమే ఇందుకు కారణమని అధ్యయనకారులు తెలిపారు. అలాగే, వైరస్ తమను ఏమీ చేయలేదన్న ధీమా కూడా ఇందుకు మరో కారణమని పేర్కొన్నారు.
మాస్కులు ధరించాలన్న నిబంధన లేనిచోట్ల పురుషులు అధిక సంఖ్యలో మాస్కులకు దూరంగా ఉంటున్నట్టు సర్వేలో స్పష్టమైంది. అయితే, నిజానికి శాస్త్రపరంగా చూస్తే స్త్రీలలో కంటే పురుషుల్లోనే కరోనా ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. వారి రక్తంలో ఉండే ఓ ఎంజైమ్ వైరస్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.