Nepal: నేపాల్ లో తొలి కరోనా మరణం నమోదు

Nepal registered its first corona death

  • 29 ఏళ్ల యువతి కరోనాతో మృతి
  • నేపాల్ లో మొత్తం కేసుల సంఖ్య 278
  • కోలుకున్న వారి సంఖ్య 36

చిన్న దేశం నేపాల్ లో తొలి కరోనా మరణం నమోదైంది. సింధుపాల్ చౌక్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల మహిళ ఇటీవలే కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరింది. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నేపాల్ లో కరోనా కారణంగా నమోదైన తొలి మరణం ఇదే. ఈ మేరకు నేపాల్ ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, నేపాల్ లో కొత్తగా ఐదు పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో మొత్తం కేసుల సంఖ్య 278కి పెరిగింది. ఇప్పటివరకు 36 మంది డిశ్చార్జి కాగా, 242 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నేపాల్ లో నేటివరకు 26,691 కరోనా టెస్టులు నిర్వహించారు.

Nepal
Corona Virus
Death
Positive Cases
  • Loading...

More Telugu News