Sachin Tendulkar: స్టే హోమ్ చాలెంజ్ విసిరిన యువీ... తనదైన శైలిలో బదులిచ్చిన మాస్టర్!

Sachin re challenge Yuvraj

  • కరోనా నేపథ్యంలో క్రికెటర్ల చాలెంజ్
  • బంతిని బ్యాట్ తో టాప్ చేస్తూ సచిన్ ను నామినేట్ చేసిన యువీ
  • కళ్లకు గంతలు కట్టుకుని మరీ టాప్ చేసిన సచిన్

కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఇంట్లో ఉండడమే ఏకైక మార్గమన్న విషయం తెలిసిందే. ఇంటి వద్దే ఉండడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో క్రికెటర్లు స్టే హోమ్ చాలెంజ్ ప్రారంభించారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ క్రికెట్ బ్యాట్ తో బంతిని కొద్దిసేపు టాప్ చేసి సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ లను నామినేట్ చేశాడు.

యువీ చాలెంజ్ ను స్వీకరించిన సచిన్.. కళ్లకు అడ్డంగా నల్లటి గుడ్డ కట్టుకుని మరీ బ్యాట్ తో బంతిని ట్యాప్ చేశాడు. చివర్లో ఆ గుడ్డను విప్పి చూపించాడు. అదెంతో పల్చగా, ఎదుట ఉన్న వస్తువులు కనిపించేట్టుగా ఉంది. ఆ గుడ్డను చూపిస్తూ కొంటెగా నవ్వేసిన సచిన్, తనను చాలెంజ్ చేసిన యువీకి తిరిగి చాలెంజ్ విసిరాడు. తాను చేసిన విధంగా చేయాలంటూ సవాల్ విసిరాడు. అంతేకాదు, ఈ సమయంలో తాను సూచించగలిగింది ఒక్కటేనని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడం ద్వారా సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News