Langur: తల్లి ప్రేమను చాటిన కొండముచ్చు... వీడియో ఇదిగో!

Langur saves her child in a adventures way

  • కరెంటు తీగలపైకి ఎక్కిన కొండముచ్చు పిల్ల
  • దిగడం చేతకాక అవస్థలు
  • ఎంతో ఒడుపుగా వ్యవహరించి పిల్లను కాపాడుకున్న తల్లి కొండముచ్చు

సామాజిక మాధ్యమం విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాక ఎక్కడ, ఏ విషయం జరిగినా అందరికీ తెలిసిపోతోంది. ఓ కొండముచ్చు కరెంటు తీగలపైకి ఎక్కిన తన పిల్లను ఏ విధంగా కాపాడుకుందో తెలిపే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ డాబా ఇంటి సమీపంలో ఉన్న కరెంటు తీగలపైకి కొండముచ్చు పిల్ల ఎక్కింది. ఆడుకుంటూ ముందుకెళ్లిన ఆ కోతిపిల్లకు దిగడం ఎలాగో తెలియలేదు. తీగలు ఊగుతుండడంతో ఆ కోతిపిల్ల పట్టు తప్పకుండా ఉండేందుకు నానాయాతన పడింది. దాంతో తన పిల్ల ప్రమాదంలో పడిందని తెలుసుకున్న తల్లి కొండముచ్చు తాను కూడా కరెంటు తీగలపైకి ఎక్కి ఎంతో లాఘవంగా తన పిల్లను సురక్షిత ప్రాంతానికి చేర్చింది. ఒక్కుదుటున లంఘించి తన పిల్లను అందుకుని మళ్లీ అంతే చాకచక్యంగా పిట్టగోడపైకి చేరిన తీరు అద్భుతం అని చెప్పాలి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News