China: కరోనా వైరస్ తొలి నమూనాలను ధ్వంసం చేయాలని ఆదేశించింది మేమే: చైనా ఒప్పుకోలు

China confess that it says virus first samples to be destroyed

  • ఆ నమూనాలను నాశనం చేసేనాటికి ‘సార్స్ కోవ్2’ వైరస్‌ను గుర్తించలేదు
  • వైరస్ విస్తరించకుండా ఉండాలనే నాశనం చేయమన్నాం
  • అమెరికాది అనవసర రాద్ధాంతం

తొట్టతొలి కరోనా నమూనాలను ధ్వంసం చేయాలని ఆదేశించింది తామేనని చైనాకు చెందిన నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) అంగీకరించింది. తాము ఆ నమూనాలను నాశనం చేసే నాటికి కోవిడ్‌ వ్యాధికి కారణమయ్యే వైరస్ ‘సార్స్ కోవ్2’ను ఇంకా గుర్తించలేదని, ఆ నమూనాల కారణంగా వైరస్ మరింత మందికి వ్యాపించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వాటిని ధ్వంసం చేయాలని ఆదేశించినట్టు ఎన్‌హెచ్‌సీ‌లోని సైన్స్ అండ్ హెల్త్ విభాగానికి చెందిన ల్యూ డెంగ్‌ఫెంగ్ పేర్కొన్నారు. అనుమతుల్లేని ప్రయోగశాలల్లోని శాంపిళ్లను మాత్రమే ధ్వంసం చేసినట్టు ల్యూ తెలిపారు.

గుర్తు తెలియని న్యూమోనియా వ్యాపించిన వెంటనే దాని గురించి తెలుసుకునేందుకు పరిశోధనశాలలు రంగంలోకి దిగాయని, ఈ క్రమంలో పూర్తి విషయాలు వెల్లడయ్యేంత వరకు ఆ వైరస్‌ను అడ్డుకునేందుకు ‘క్లాస్-2’ వ్యాధి కారకంగా దానిని గుర్తించినట్టు ల్యూ వివరించారు. అయితే, ఈ విషయాన్ని అమెరికా వక్రీకరించి గందరగోళం సృష్టించిందని ఆరోపించారు. గతంలో ఇన్‌ఫ్లూయెంజా, సార్స్ వైరస్ నమూనాలను ప్రపంచ దేశాలతో పంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ల్యూ గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News