Domestic Air Services: విమాన ప్రయాణాలపై గుడ్ న్యూస్ చెప్పిన ఏఏఐ
- త్వరలోనే ప్రారంభం కానున్న సర్వీసులు
- మార్గదర్శకాలను విడుదల చేసిన ఏఏఐ
- ప్రయాణికులకు మాస్క్, శానిటైజర్ తప్పనిసరి
కరోనా కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది. అయితే ప్రయాణికులు కొన్ని నిబంధనలను పాటించాలని చెప్పింది. ప్రతి ప్రయాణికుడి వద్ద ఆరోగ్యసేతు యాప్ తప్పనిరిగా ఉండాలని తెలిపింది. ప్రయాణికుల మధ్య కనీసం నాలుగు అడుగుల దూరం ఉండాలని చెప్పింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలిపింది. విమానాశ్రయానికి వచ్చే ముందే బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకురావాలని చెప్పింది. ప్రతి ఒక్కరి వద్ద శానిటైజర్ ఉండాలని తెలిపింది. విమాన సిబ్బందికి ప్రయాణికులు పూర్తిగా సహకరించాలని సూచించింది.