Pavan kalyan: పవన్ కోసం కథ రెడీ చేసిన త్రివిక్రమ్

Trivikram Movie

  • పవన్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండు హిట్లు
  •  త్రివిక్రమ్ కథకి పవన్ గ్రీన్ సిగ్నల్
  •  ఇద్దరి కలయికలో నాలుగో సినిమా  

పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా, వాటిలో రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. నాలుగో సినిమా రావడానికి కూడా చాలా  అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేసి ఆయనకి వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట.

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చేస్తున్న పవన్, ఆ తరువాత సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఈ రెండు సినిమాలు విడుదల తరువాత, పవన్ - త్రివిక్రమ్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒక శుభవార్తేనని చెప్పాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే  తెలియనున్నాయి.

Pavan kalyan
Trivikram Srinivas
Venu sriram
  • Loading...

More Telugu News