SV Krishna Reddy: సీరియల్స్ వైపుకు ఎస్వీ కృష్ణారెడ్డి?

Yamaleela Movie

  • కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా పేరు
  • కొంతకాలంగా మెగా ఫోన్ కి దూరం
  • సీనియర్ దర్శకుల బాటలోనే అడుగులు    

కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించి విజయాలను అందుకున్న దర్శకుల జాబితాలో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరుగా కనిపిస్తాడు. కథ, కథనాలపై .. సంగీతంపై కూడా ఎస్వీ కృష్ణారెడ్డికి మంచి పట్టువుంది. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ఈ విషయాలను నిరూపించాయి.  అలాంటి కృష్ణారెడ్డి .. సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించి చాలాకాలమే అయింది. దాంతో ఆయన సీరియల్స్ వైపుకు వెళ్లాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.

వంశీ .. బాపు వంటి దర్శకులు సీరియల్స్ చేయగా, రాఘవేంద్రరావు వంటివారు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అలా ఎస్వీ కృష్ణారెడ్డి .. సీరియల్స్ కి దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆయన సినిమాల్లో 'యమలీల' స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. ఆ స్టోరీ లైన్  ను టచ్ చేస్తూ, ఆ కథకి కొనసాగింపుగా ఆయన తొలి సీరియల్ వుండనుందని అంటున్నారు. కథాకథనాలకి సంబంధించిన చర్చల్లో పాలుపంచుకోవడం .. దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించడం వరకూ ఆయన చేస్తాడని చెబుతుతున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం బుల్లితెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

SV Krishna Reddy
Yamaleela Movie
Tollywood
  • Loading...

More Telugu News