Kever Toktas: కన్న కొడుకును కిరాతకంగా హత్య చేసిన టర్కీ ఫుట్ బాల్ స్టార్ కెవెర్ టోక్టాస్!

Turkey football Star murdered own Son

  • కరోనా లక్షణాలతో కుమారుడితో సహా ఆసుపత్రిలో చేరిన టోక్టాస్
  • ఆపై దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య
  • 11 రోజుల తరువాత పశ్చాత్తాపంతో లొంగిపోయిన వైనం

కన్న కుమారుడిని దారుణంగా హత్య చేసిన టర్కీ ఫుట్ బాల్ స్టార్ కెవెర్ టోక్టాస్, అతను కరోనా సోకి చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు కూడా చేశాడు. ఆపై తీవ్రమైన పశ్చాత్తాపంతో పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటన టర్కీలో ఫుట్ బాల్ అభిమానుల్లో తీవ్ర కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కరోనా లక్షణాలు కనిపించిన కారణంతో గత నెల 23న తన ఐదేళ్ల కుమారుడు ఖాసిమ్ తో కలిసి నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్ లోని ఓ హాస్పిటల్ లో కెవెర్ టోక్టాస్ చేరాడు.

వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికీ నెగటివ్ రావడంతో, ముందు జాగ్రత్త చర్యగా ఇద్దరినీ ఐసోలేషన్ లో ఉంచారు. ఆపై ఈ నెల 4న అతని గదిలోకి వెళ్లిన టోక్టాస్, కుమారుడి ముఖంపై దిండును అదిమి పెట్టి ఊపిరాడకుండా చేశాడు. ఆపై ఏమీ ఎరుగనట్టు ఉండిపోయాడు. బాలుడి పరిస్థితి విషమించిందని గమనించిన వైద్యులు ఐసీయూకు తరలించినా, ఫలితం దక్కలేదు. ఖాసిమ్ కరోనాతో మరణించాడని ప్రపంచాన్ని నమ్మించిన టోక్టాస్, అంత్యక్రియలు కూడా చేశాడు.

ఆపై 11 రోజుల తరువాత పోలీసుల ముందుకు వచ్చి, తాను చేసిన దుర్మార్గం గురించి చెప్పాడు. కొడుకంటే తనకు ఇష్టం లేదని, అందుకే చంపేశానని, తనకు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని చెప్పాడు. ఆపై టోక్టాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసును విచారిస్తున్నారు.

Kever Toktas
Turkey
Football Player
Murder
Son
  • Loading...

More Telugu News