Akhil: దసరాకి రావాలనే ఆలోచనలో 'బ్యాచ్ లర్'

Most Eligible Bachelor Movie

  • 'బ్యాచ్ లర్' గా రానున్న అఖిల్
  • కరోనా కారణంగా రిలీజ్ లేట్
  • రిస్క్ చేయవద్దంటున్న  అభిమానులు

అఖిల్ కథానాయకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' రూపొందింది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఏప్రిల్లో విడుదల చేయాలని భావించారు. కానీ ఈ లోగా కరోనా దూసుకురావడం .. లాక్ డౌన్ విధించడం జరిగిపోయాయి. దాంతో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిపోయింది. లాక్ డౌన్ ఎత్తినా ఇప్పట్లో థియేటర్స్ కి జనాలు వచ్చే అవకాశం తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అందువలన దసరా పండుగకి ఈ సినిమాను బరిలోకి దింపడమే మంచిదనే నిర్ణయానికి గీతా ఆర్ట్స్ వారు వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన చాలా సినిమాలు దసరా సీజన్ పైనే దృష్టి పెట్టాయి. అందువలన అఖిల్ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకడం కష్టమేనని అంటున్నారు. అంతేకాదు మిగతా సినిమాల పోటీని తట్టుకుని అఖిల్ నిలబడవలసి ఉంటుంది.  ఇంతవరకూ సరైన హిట్ కొట్టలేకపోయిన అఖిల్, దసరాకి రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Akhil
Pooja Hegde
Bommarillu Bhaskar
  • Loading...

More Telugu News