Narendra Modi: బిల్ గేట్స్ తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు!

Bill Gates and Modi Talks on Corona

  • కలసి పనిచేస్తేనే కరోనా కట్టడి
  • తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురి చర్చలు
  • ప్రపంచానికి గేట్స్ ఫౌండేషన్ మార్గ నిర్దేశం చేయాలన్న మోదీ
  • కరోనా కట్టడిలో మరింతగా పనిచేయాలన్న గేట్స్

కరోనా కట్టడి, దేశాల మధ్య పరస్పర సహకారం తదితర అంశాల విషయంలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు జరిపారు. కలసి పనిచేస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ఇరువురూ అభిప్రాయపడ్డారు. మహమ్మారిని ఎదుర్కొనేలా ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్న చర్చల్లో ఇండియానూ భాగస్వామ్యం చేయాలని మోదీ సూచించారు.

ఇండియాలో అనుసరిస్తున్న వ్యూహాలను గురించి తదుపరి వైరస్ కట్టిడి ప్రణాళికల గురించి వివరించారు. తమ దేశంలో ప్రజల భాగస్వామ్యంతో కరోనాపై పోరాడుతున్నామని వ్యాఖ్యానించిన మోదీ, భౌతికదూరం, పరిశుభ్రత, మాస్క్ లు ధరించడం వంటి చర్యల్లో ప్రజల భాగస్వామ్యాన్ని తెలియజేశారు. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులను సముచితంగా గౌరవిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంచేలా అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నామని, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందని మోదీ వివరించారు.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిని నిలువరించేందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఎంతో కృషి చేస్తోందని ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ, ఇండియా మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భవిష్యత్తులో కరోనా చూపించే మార్పులను ముందుగానే విశ్లేషించి, ప్రజలకు మార్గదర్శనం చేయడంలో గేట్స్ ఫౌండేషన్ చొరవ చూపించాలని మోదీ కోరారు.

Narendra Modi
Bill Gates
Gates and Milinda Foundation
  • Loading...

More Telugu News