TTD: 'శ్రీవారి పాదాల' చెంతకు ఆర్టీసీ బస్సు.. అధికారుల ట్రయల్ రన్

RTC trial runs a bus to Sreevari padalu
  • మూలమలుపుల్లో బస్సు తిరగడంలో ఇబ్బందులు
  • మలుపులు వెడల్పు చేసి, రోడ్డు బాగుచేస్తే బస్సులు నడిపేందుకు రెడీ
  • తిరుమల భక్తుల కోసం మూడు రకాల బస్సులు
తిరుమలలోని పాపవినాశనం వరకు బస్సులు నడుపుతున్న ఆర్టీసీ గురువారం ‘శ్రీవారి పాదాలు’ వద్దకు ఓ బస్సుతో ట్రయల్ రన్ నిర్వహించింది. ఈ సందర్భంగా రెండు మలుపుల్లో బస్సు తిరగడం కష్టమైనట్టు అధికారులు గుర్తించారు. దీంతో మలుపులను వెడల్పు చేయడంతోపాటు రోడ్డుకు మరమ్మతులు చేస్తే బస్సులు నడిపేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ టీటీడీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, దేవాలయ అవసరాలతోపాటు స్థానికులు, వ్యాపారుల సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా కార్గో సర్వీసులు ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ఇప్పటి వరకు ‘సంఘం లారీల’ ద్వారా సరుకు రవాణా చేస్తుండగా, గత కొంతకాలంగా వీటిని అనుమతించడం లేదు. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల భక్తుల కోసం ఆర్టీసీ మూడు రకాల బస్సులను సిద్ధం చేస్తోంది. 49 సీట్లలో 30 మందికి, 47 సీట్లలో 28 మందికి, 45 సీట్లలో 25 మందికి మాత్రమే అనుమతించనుంది.
TTD
Tirumala
Tirupati
APSRTC

More Telugu News