Chandrababu: వరుస ప్రమాదాలు నా మనసును కలచివేశాయి: చంద్రబాబు

Chandrababu respond on Prakasam District incident
  • ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం
  • విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో 10 మంది మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్న చంద్రబాబు
  • కూలీల కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని విజ్ఞప్తి
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో జరిగిన దుర్ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు తన మనసును కలచివేస్తున్నాయని ట్వీట్ చేశారు. విశాఖలో విషవాయువు 12 మందిని బలిగొన్న ఘటన జరిగి వారం తిరగకముందే ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరగడం తనను దిగ్భ్రాంతికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబీలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నానని, ప్రమాదంలో మరణించినవారంతా కూలీలు కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని పేర్కొన్నారు.
Chandrababu
Road Accident
Prakasam District
Raparla
Tractor

More Telugu News