Botsa Satyanarayana: టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదు ‘జూమ్’ పార్టీ: బొత్స సెటైర్లు

Minister Botsa Pressmeet

  • ‘కరోనా’ ప్రాంతాల్లో ప్రజలను పలకరించేందుకు టీడీపీ నాయకులు వెళ్లరే?
  • ప్రమాదాలు సంభవించిన ప్రాంతాల్లో ప్రజలనూ పరామర్శించరు!
  • జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంపై  విమర్శలైతే చేస్తారు!

ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కరోనా’ ఉన్న ప్రాంతాల్లో వారిని, ప్రమాదాలు సంభవించిన ప్రాంతాల్లో ప్రజలను పరామర్శించేందుకు టీడీపీ నాయకులు వెళ్లరని, వారికి సాయపడరని విమర్శించారు.

జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు అయితే చేస్తారని, టీడీపీ.. ‘జూమ్ పార్టీ’గా తయారైందని సెటైర్లు విసిరారు. సీఎం జగన్ ఏం మాట్లాడినా దానిని తప్పుగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన టీడీపీలో కనిపిస్తోందని విమర్శించారు. విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనపై సీఎం చొరవతో 5 రోజుల్లోనే అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని, అదే కనుక, టీడీపీ అయితే ఈ సమస్య సద్దుమణిగేందుకు 50 రోజులు పట్టేదని ఎద్దేవా చేశారు. 

Botsa Satyanarayana
YSRCP
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News