Junior NTR: ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా సిద్ధమైన 'ఆర్ ఆర్ ఆర్' స్పెషల్ వీడియో

RRR Movie

  • ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు
  • పాత్రను పరిచయం చేస్తూ రానున్న వీడియో
  • ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు

ఎన్టీఆర్ - చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఇంకా కొన్ని రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలివుంది. లాక్ డౌన్ ఎత్తేయగానే మిగతా షూటింగు మొదలుకానుంది. ఇటీవల చరణ్  పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను వదిలారు. ఆ వీడియోకు అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఇక త్వరలో ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియో పలకరించనుంది. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'ఆర్ ఆర్ ఆర్' లో ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను వదలనున్నారు. ఇప్పటికే వీడియోను సిద్ధం చేశారట. టీమ్ అంతా కూడా ఈ వీడియో పట్ల సంతృప్తికరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ వీడియో ఉంటుందని అంటున్నారు. ముందుగా చెప్పిన ప్రకారమే జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Junior NTR
Charan
Rajamouli
RRR Movie
  • Loading...

More Telugu News