Allu Arjun: అల్లు అర్జున్ ట్వీట్ పై స్పందించిన డేవిడ్ వార్నర్

Devid Warner Responds on Bunny Tweet

  • తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తున్న డేవిడ్ వార్నర్
  • మరో అతిపెద్ద సర్‌ప్రైజ్ అన్న బన్నీ
  • తన వంతు ప్రయత్నం చేశానన్న వార్నర్

సన్ ‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇటీవలి కాలంలో తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ, వాటిని టిక్ ‌టాక్ ‌లో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన తాజా సూపర్ హిట్ చిత్రం 'అల వైకుంఠపురములో'ని 'బుట్టబొమ్మా బుట్టబొమ్మా' పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేయగా, అది తెగ వైరల్ అయింది.

అదే ఊపులో 'రాములో రాములా...' పాటకు కూడా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను చూసిన అల్లు అర్జున్, వార్నర్ డ్యాన్స్ ను మెచ్చుకుంటూ, "మరో అతిపెద్ద సర్‌ప్రైజ్. మరోసారి ధన్యవాదాలు సర్" అని వ్యాఖ్యానించగా, వార్నర్ స్పందించాడు. "ఏదో నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు ఆ పాట, డ్యాన్స్ చాలా నచ్చాయి" అని ట్వీట్ చేశాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News