China: హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. సాయాన్ని నిలిపేస్తాం: డబ్ల్యూహెచ్ఓను బెదిరించిన చైనా

China warns WHO says American CIA

  • సీఐఏ నివేదికను ఉటంకిస్తూ ‘న్యూస్‌వీక్’ కథనం
  • జనవరిలోనే ఘటన
  • జిన్‌పింగ్ ఫోన్ చేయలేదన్న డబ్ల్యూహెచ్ఓ

కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను చైనా హెచ్చరించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఈ విషయాన్ని బయటపెట్టింది. జనవరిలో చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు  ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డబ్ల్యూహెచ్ఓ భావించింది.

అయితే, అదే జరిగితే సహకారాన్ని ఆపేస్తామని డబ్ల్యూహెచ్ఓను చైనా బెదిరించినట్టు సీఐఏ తాజా నివేదికను ఉటంకిస్తూ ‘న్యూస్‌వీక్’ తన కథనంలో పేర్కొంది. దీంతో వైరస్ విషయంలో తాము స్వతంత్రంగానే వ్యవహరించినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నట్టు న్యూస్‌వీక్ రాసుకొచ్చింది. మరోవైపు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధ్‌నామ్ మధ్య జనవరిలో ఫోన్ సంభాషణ జరిగినట్టు వస్తున్న వార్తలను డబ్ల్యూహెచ్ఓ ఖండించింది.

  • Loading...

More Telugu News