Nirmala Sitharaman: ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేకుండానే రుణాలు: నిర్మలా సీతారామన్

RS 3 laks crores to MSMEs says Nirmala Sitharaman

  • ఎంఎస్ఎంఈలకు రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు
  • 12 నెలల మారిటోరియంతో రుణాలు
  • తక్షణమే ఉత్పత్తిని ప్రారంభించేందుకు రుణాలు తోడ్పడతాయి

ప్రధాని మోదీ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ'లో ఎంఎస్ఎంఈలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎలాంటి పూచీకత్తు లేకుండానే కంపెనీలకు 12 నెలల మారిటోరియంతో, 4 ఏళ్ల కాలపరిమితితో రుణాలు ఇస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లు తక్షణమే ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఈ రుణాలు తోడ్పడతాయని చెప్పారు. ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు కూడా ఉపయోగపడతాయని అన్నారు.

రూ. 50 వేల కోట్లను ఎంఎస్ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడులకు కేటాయిస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. శక్తి, సామర్థ్యం ఉన్న ఏ ఎంఎస్ఎంఈ  అయినా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఎన్పీఏ ముప్పు ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ కూడా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చని చెప్పారు. ఎంఎస్ఎంఈల పెట్టుబడి పరిమితిని గణనీయంగా పెంచుతున్నామని... పెద్ద మొత్తంలో పెట్టుబడులు  వచ్చిన కంపెనీలు కూడా ఈ కేటగిరీలోనే ఉంటాయని తెలిపారు.

  • Loading...

More Telugu News