Kanna Lakshminarayana: పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లివ్వాల్సిందే: కన్నా డిమాండ్
- సీమకు నీళ్లివ్వాలన్నదే బీజేపీ డిమాండ్
- అవసరమైతే తెలంగాణతో న్యాయపోరాటం చేయాలి
- ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా
రాయలసీమ కరవు నివారణకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం, కాలువల సామర్థ్యం పెంచి కృష్ణా జలాలు వాడుకునేందుకు వీలుగా కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అనుమతివ్వడం, ఈ నిర్ణయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుబట్టడం తెలిసిందే. ఈ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లివ్వాలనేది తమ పార్టీ డిమాండ్ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేసి అయినా సీమకు నీళ్లివ్వాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గుంటూరు, రింగు రోడ్డులోని శ్రీ చైతన్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తమ పార్టీ నేతలతో కలిసి కన్నా ఇవాళ సందర్శించారు. అక్కడి సౌకర్యాలపై క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంశాన్ని ప్రస్తావించారు.