Pavn kalyan: పవన్ .. హరీశ్ శంకర్ మూవీ టైటిల్ ఖరారైనట్టే

Harish Shankar Movie

  • మాస్ దర్శకుడిగా హరీశ్ శంకర్
  • పవన్ తో సినిమాకి సన్నాహాలు
  • టైటిల్ గా 'ఇప్పుడే మొదలైంది'


పవన్ కల్యాణ్ .. హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్'  సంచలన విజయాన్ని సాధించింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా తమ కాంబినేషన్లో సినిమా ఉందనే విషయాన్ని హరీశ్ శంకర్ ధ్రువీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ఎలా ఉండనుంది?  కథా వస్తువు ఏదై ఉంటుంది?  అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాకి 'ఇప్పుడే మొదలైంది' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. అసలైన ఆట 'ఇప్పుడే మొదలైంది' అనే అర్థం వచ్చేలా వున్న ఈ టైటిల్ పవర్ఫుల్ గానే వుంది .. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిగానే వుంది. క్రిష్  దర్శకత్వంలో చేయనున్న సినిమా పూర్తయిన తరువాత, హరీశ్ శంకర్ తో కలిసి పవన్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెబుతున్నారు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే హరీశ్ శంకర్ కథను సిద్ధం చేసినట్టుగా సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన  మిగతా వివరాలను త్వరలో  వెల్లడించనున్నారు.

Pavn kalyan
Harish Shankar
Tollywood
  • Loading...

More Telugu News