Junior NTR: తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి ఓ మాట చెప్పనున్న ఎన్టీఆర్!

RRR Movie

  • ఈ నెల 20న ఎన్టీఆర్  పుట్టినరోజు
  • వేడుకల ఆలోచనలో అభిమానులు
  • ఆసక్తిని చూపని ఎన్టీఆర్

తెలుగులో ఎన్టీఆర్ కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. మాస్ ఆడియన్స్ లో ఆయనకి మంచి ఫాలోయింగ్ వుంది. అలాంటి ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20 వ తేదీన ఆయన పుట్టినరోజు .. ఆయా ప్రాంతాల్లోని ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఒక వీడియోను వదలనున్నట్టు తెలుస్తోంది. దేశంలో ఈ నెల 17 వరకూ లాక్ డౌన్ అమల్లో వుంది. తెలంగాణలో ఈ నెల 29 వరకూ లాక్ డౌన్ వుంది. ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో తను పుట్టినరోజు వేడుక జరుపుకోకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉన్నాడని అంటున్నారు.

అందుకే, తన పుట్టిన రోజు సందర్భంగా వేడుకల పేరుతో అభిమానులెవరూ ఎలాంటి హడావిడి చేయవద్దనీ, లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోమని ఆయన వీడియో సందేశాన్ని వదలనున్నట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా' ఆర్ ఆర్ ఆర్' నుంచి స్పెషల్ వీడియో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Junior NTR
Rajamouili
RRR Movie
  • Loading...

More Telugu News