APSRTC: మోడల్ రెడీ... ఇలా మారిపోనున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు!

APSRTC Bus Changes Like this

  • 36 సీట్ల స్థానంలో 26 సీట్లు
  • మధ్యలో సీటు ఏర్పాటు
  • అధికారులు అనుమతిస్తే, అన్నీ ఇలానే

లాక్ డౌన్ ను తొలగించిన తరువాత కూడా భౌతికదూరం, మాస్క్ లు ధరించడం తప్పనిసరైన నేపథ్యంలో, ప్రజా రవాణాపై మల్లగుల్లాలు పడుతున్న ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీ బస్సులను సమూలంగా మార్చాలని నిర్ణయించారు.

ప్రయాణికుల మధ్య దూరం తప్పనిసరిగా ఉండాల్సిన నేపథ్యంలో మొత్తం 36 సీట్లలో 10 సీట్లను తగ్గించి, 26 సీట్లకు కుదించారు. ప్రయాణికులు నడిచే దారిలో 8 సీట్లను అమర్చారు. అటూ, ఇటూ రెండు రెండు సీట్లుండే చోట ఒక్క సీటునే ఏర్పాటు చేశారు. ఈ మోడల్ ను అధికారులు ఓకే చేస్తే, మిగతా అన్ని బస్సులనూ ఇలాగే మార్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

APSRTC
Super Luxuary
Bus
Seat
  • Loading...

More Telugu News