Nara Lokesh: 'కెమెరా ముందు సినిమా కష్టాలు పడుతున్న వైసీపీ నట నమూనాలు' అంటూ లోకేశ్ వ్యంగ్యం

Lokesh satires on YSRCP leaders efforts in villages
  • వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనతో గ్రామాల్లో భయాందోళనలు
  • ప్రజల్లో భరోసా పెంచేందుకు గ్రామాల్లో బస చేసిన వైసీపీ నేతలు
  • ఓ ఇంట్లో నిద్రించిన విజయసాయిరెడ్డి
వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన అనంతరం ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి వైసీపీ నేతలు విషవాయు ప్రభావిత గ్రామాల్లో నిద్రించారు. అయితే, దీనిపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ వ్యంగ్యభరితంగా స్పందించారు. కెమెరా ముందు సినిమా కష్టాలు పడుతున్న వైసీపీ నట నమూనాలు అంటూ ఓ వీడియో ట్వీట్ చేశారు.

ఆ వీడియోలో వైసీపీ నేత ఒకరు ఉదయాన్నే లేచి పశువులకు మేత వేసే దృశ్యం, ఓ ఇంట్లో విజయసాయి నిద్రించిన దృశ్యాలు చూపించారు. ఇక, వైసీపీ నేత పశువులకు మేత వేసే ప్రయత్నం చేయగా, ఒక్క పశువు కూడా మేత తినకపోవడం వీడియోలో కనిపించింది. ఈ తతంగాన్ని కూడా వైసీపీ నేతలు ఆసక్తిగా కెమెరాలు, మొబైళ్లతో చిత్రీకరించడాన్ని ఉద్దేశించి లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించినట్టు అర్థమవుతోంది. అటు, విజయసాయి నిద్ర వ్యవహారంలోనూ కెమెరాతో ఓ వ్యక్తి చిత్రీకరిస్తుండడాన్ని వీడియోలో ప్రత్యేకంగా హైలైట్ చేశారు.
Nara Lokesh
Vijay Sai Reddy
YSRCP
Vizag Gas Leak
Vizag

More Telugu News