David Warner: మరో తెలుగు పాటకు స్టెప్పులు కుమ్మేసిన డేవిడ్ వార్నర్

Warner and family dance again for a popular song

  • ఇప్పటికే బుట్టబొమ్మ పాటతో అలరించిన వార్నర్ ఫ్యామిలీ
  • తాజాగా రాములో రాములా పాటకు డ్యాన్స్
  • తెలుగు సినిమాలపై విపరీతమైన క్రేజ్ చూపిస్తున్న ఆసీస్ క్రికెటర్

ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఇటీవల తెలుగు సినిమా పాటలు, డైలాగులపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే బుట్టబొమ్మా బుట్టబొమ్మా పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించిన వార్నర్, పోకిరిలో హిట్ డైలాగ్ చెప్పి మరింత విస్మయానికి గురిచేశాడు. ఇప్పుడు రాములో రాములా పాటకు తన కుటుంబ సభ్యులతో కలిసి వార్నర్ టిక్ టాక్ లో మరో వీడియో చేశాడు. తన భార్యతో కలిసి వార్నర్ హుషారుగా స్టెప్పులేస్తుండగా, కూతురు కూడా హుషారుగా కాలు కదిపింది. ఏదేమైనా వార్నర్ చూపు అల్లు అర్జున్ పాటలు, స్టెప్పులపై పడిందనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు వార్నర్ చేసిన పాటలు బన్నీ నటించిన అల.. వైకుంఠపురములో చిత్రంలోనివే కావడం విశేషం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News