Uttam Kumar Reddy: 'పీఎం కేర్స్ ఫండ్' పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy harsh comments on PM CARES fund
  • పీఎం కేర్స్ పేరిట భారీగా వసూలు చేశారని వ్యాఖ్యలు
  • ఎంత వసూలైందో ప్రధాని చెప్పడంలేదని ఆరోపణ
  • బహిరంగ దోపిడీ అంటూ ఆగ్రహం
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 'పీఎం కేర్స్ ఫండ్' అంశంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'పీఎం కేర్స్ ఫండ్' ద్వారా భారీగా నిధులు సేకరించారని, ఇప్పుడా డబ్బంతా ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. "ప్రజల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి 'పీఎం కేర్స్ ఫండ్' పేరిట భారీమొత్తంలో నిధులు వసూలు చేశారు. అయితే ఇప్పటివరకు వసూలైన మొత్తం ఎంత అనేది ప్రధాని చెప్పడంలేదు. ఆ డబ్బును ఏంచేస్తున్నారో కూడా తెలియజెప్పడంలేదు. ఓ బహిరంగ దోపిడీ తరహాలో డబ్బులు దండుకున్నారు. 'పీఎం కేర్స్' అనేది ఉందా? ఒకవేళ ఉంటే అది ఎవరి కోసం ఉన్నట్టు?" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Uttam Kumar Reddy
PM CARES Fund
Lockdown
Corona Virus
Narendra Modi
India

More Telugu News