Dil Raju: ప్రభాస్ కోసం కథను సిద్ధం చేయిస్తున్న 'దిల్' రాజు

Venu Sriram Movie

  • సెట్స్ పై రాధాకృష్ణ కుమార్ మూవీ
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న నాగ్ అశ్విన్ సినిమా
  • దర్శకుడిగా వేణు శ్రీరామ్ కి మరో అవకాశమిచ్చిన 'దిల్' రాజు

ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా స్థాయి సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి బడా నిర్మాతలు మాత్రమే రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన, ఆ తరువాత సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు.  ఈ సినిమా తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

చాలా కాలం క్రితం ప్రభాస్ హీరోగా 'దిల్' రాజు  'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాను నిర్మించాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు ప్రభాస్ తో ఒక సినిమా చేయాలనే నిర్ణయానికి 'దిల్' రాజు వచ్చాడట. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ ను .. ఆయనకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కథను సిద్ధం చేయమని దర్శకుడు వేణు శ్రీరామ్ కి చెప్పాడని అంటున్నారు. వేణు శ్రీరామ్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టాడని చెబుతున్నారు.

'మిడిల్ క్లాస్ అబ్బాయి' హిట్ తరువాత నుంచి 'దిల్' రాజు - వేణు శ్రీరామ్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.  ప్రస్తుతం ఈ ఇద్దరూ 'వకీల్ సాబ్' సినిమాకి కలిసి పనిచేస్తున్నారు. వేణు శ్రీరామ్  కొత్తగా అనిపించే కథను సిద్ధం చేయగలడనే నమ్మకంతోను .. ఆ కథను వినిపించి ప్రభాస్ ను ఒప్పించగలననే నమ్మకంతోను  'దిల్' రాజు వున్నాడని అంటున్నారు.

Dil Raju
Prabhas
Venu Sriram
  • Loading...

More Telugu News