నా కూతురికి నటనపట్ల ఆసక్తి వుంటే అడ్డుచెప్పను: సురేఖావాణి
- సురేఖావాణికి తగ్గిన అవకాశాలు
- నా కూతురిని అలా పెంచాను
- తన ఇష్టమన్న సురేఖావాణి
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " నాకు తోచినట్టుగా బతకడమే నాకు ఇష్టం. నేను .. నా కూతురు సరదాగా సినిమాలకి .. షికార్లకు వెళుతుంటాము. మా అమ్మ నన్ను స్వేఛ్ఛా భావాలతో పెంచింది. అలాగే నా కూతురిని నేను పెంచుతూ వచ్చాను. మా జీవితాలను ఎవరూ ప్రశ్నించే అవకాశం ఇవ్వను. నా కూతురు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి. తనకి నటన పట్ల ఆసక్తి వుంటే .. సినిమాల్లోకి వెళ్లాలనే ఉత్సాహం వుంటే నేను అడ్డుచెప్పను" అంటూ తన మనసులోని మాటను స్పష్టంగా తెలియజేసింది. ఇక సురేఖావాణి కూతురు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.