Kishore Kumar Pardhasani: మరో హీరోతో రంగంలోకి దిగనున్న దర్శకుడు డాలీ

Kishore Kumar Pardhasani Movie

  • 'గోపాల గోపాల'తో హిట్ కొట్టిన పవన్
  • మాస్ ఆడియన్స్ ను అలరించిన 'కాటమరాయుడు'
  • మరో ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు

దర్శకుడు డాలీ పేరు వినగానే 'గోపాల గోపాల' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో పవన్ కల్యాణ్ ను మోడ్రన్ కృష్ణుడిగా చూపించే సాహసం చేసి సక్సెస్ ను సాధించాడు. ఆ తరువాత పవన్ తో ఆయన 'కాటమరాయుడు' సినిమా కూడా చేశాడు. పవన్ తో మరో సినిమా చేయడానికి ఆయన రంగంలోకి దిగినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం పవన్ 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో భారీ చారిత్రక చిత్రం .. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీ చేయనున్నాడు. లాక్ డౌన్ తరువాత అందుకు సంబంధించిన పనులు వేగవంతం కానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల తరువాత డాలీ (కిషోర్ కుమార్ పార్ధసాని) దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు మరో కథానాయకుడితో కలిసి డాలీ సెట్స్ పైకి వెళ్లనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే పవన్ కల్యాణ్ కోసం అనుకున్న కథనే ఆయన మరో హీరోతో చేయడానికి రెడీ అవుతున్నాడా? లేదంటే పవన్ తో చేయడానికి చాలా సమయం పడుతుంది కనుక, మరో కథతో  .. మరో హీరోతో ముందుకు వెళ్లనున్నాడా? అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Kishore Kumar Pardhasani
Pavan kalyan
Gopala Gopala Movie
  • Loading...

More Telugu News