మోహనకృష్ణ ఇంద్రగంటితో విజయ్ దేవరకొండ
- ముగింపు దశలో 'ఫైటర్'
- విడుదలకి ముస్తాబైన 'వి'
- హింట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
మొన్న విజయ్ దేవరకొండ పుట్టినరోజున, ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంద్రగంటి మోహనకృష్ణ ఒక ట్వీట్ చేశాడు. 'ఈ ఏడాది నీ నుంచి ఇంకా మంచి మూవీ రావలసి వుంది. నువ్వు చేసే అద్భుతాల కోసం ఎదురుచూస్తున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. అందుకు విజయ్ దేవరకొండ స్పందిస్తూ .. 'ఆ అద్భుతం మనిద్దరం కలిసి చేయబోతున్నాము' అంటూ సమాధానమిచ్చాడు.
విజయ్ దేవరకొండ ఇచ్చిన హింట్ తో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రూపొందడమనేది ఖాయంగా కనిపిస్తోంది. ఇంద్రగంటి చేసిన 'వి' విడుదలకి ముస్తాబవుతోంది. ఇక విజయ్ దేవరకొండ చేస్తున్న 'ఫైటర్' ముగింపు దశలో వుంది. త్వరలోనే ఈ ఇద్దరూ సెట్స్ పైకి వెళతారని అంటున్నారు.