Prabhas: సాధారణ మానవుడి వలన దేవకన్యకి జన్మించిన బిడ్డగా ప్రభాస్?

Nag Ashwin Movie

  • తాజా చిత్రంలో రొమాంటిక్ హీరోగా ప్రభాస్
  •  తదుపరి సినిమాలో సూపర్ హీరోగా
  • భారీతనమే ప్రత్యేక ఆకర్షణ  

ప్రభాస్ ఇటీవల కాలంలో విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఇక బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా భారీతనమనేది ఆయన సినిమాలకి ప్రధానమైన ఆకర్షణగా మారింది. ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్  హీరోగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు.

 ఈ సినిమా తరువాత ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. సోషియో ఫాంటసీగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడనే టాక్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో ఆయన ఒకానొక చిత్రమైన పరిస్థితిలో సాధారణమైన మానవుడికి .. దేవకన్యకి జన్మించిన వాడిగా కనిపిస్తాడనేది తాజా సమాచారం. మానవుడికి .. దేవకన్యకి జన్మించిన వండర్ కిడ్ అని, పెరిగి పెద్దయ్యాక అతను ఎలాంటి అద్భుతాలు చేస్తాడనేదే ప్రధానమైన కథాంశమని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతనేది చూడాలి మరి. సాంకేతిక పరంగా ఈ సినిమా అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రూపొందనుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Prabhas
Radhakrishna Kumar
Nag Ashwin
  • Loading...

More Telugu News