Dil Raju: బ్రాహ్మణ యువతితో దిల్ రాజు రెండో వివాహం... పలువురి శుభాకాంక్షలు

Dil Raju Second Marriage

  • నర్సింగ్ పల్లి వెంకటేశ్వరాలయంలో వివాహం
  • కులాంతర వివాహం చేసుకున్న నిర్మాత
  • గతంలో ఎయిర్ హోస్టెస్ గా పని చేసిన వధువు

నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లి వెంకటేశ్వరాలయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం, 20 మంది కుటుంబీకులు, స్నేహితుల మధ్య గత రాత్రి నిరాడంబరంగా జరిగింది. దిల్ రాజు మొదటి భార్య 2017లో మరణించిన సంగతి తెలిసిందే. ఆపై తన తండ్రికి మరో వివాహం జరిపించాలని కుమార్తె హన్షిత పట్టుదలగా ప్రయత్నించింది. దీంతో దిల్ రాజు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహం జరిగింది.

ఇక, దిల్ రాజు చేసుకున్నది కులాంతర వివాహం అని తెలుస్తోంది. తనకు చాలా కాలంగా పరిచయం ఉన్న ఓ బ్రాహ్మణ యువతిని ఆయన పెళ్లాడారు. యూఎస్ లో స్థిరపడిన కుటుంబానికి చెందిన ఈమె, ఎయిర్ హోస్టెస్ గానూ పని చేసినట్టు తెలుస్తోంది. వివాహం చేసుకున్న దిల్ రాజుకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాభినందనలు తెలియజేశారు.

Dil Raju
Second Marriage
  • Loading...

More Telugu News