Minister: విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన.. నివేదిక వచ్చే వరకు గ్రామాల ప్రజలు రావొద్దు: మంత్రి అవంతి

Minister Avanthi Srinivas statement

  • గ్రామాల్లో ఉండేందుకు అనువైన పరిస్థితులపై కమిటీ అధ్యయనం
  • ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద పరిస్థితి అదుపులో ఉంది
  • స్టైరిన్ గ్యాస్ ట్యాంక్ ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు తగ్గింది 

విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన కారణంగా సమీప గ్రామాల్లో ఉండటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేవా? అనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ నివేదిక వచ్చే వరకు ప్రజలు ఎవ్వరూ గ్రామాల్లోకి రావద్దని కోరారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలోని స్టైరిన్ గ్యాస్ ట్యాంక్ ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు తగ్గిందని, అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అన్నారు.

ఎలాంటి వాయువు బయటకు రావడం లేదు:  ఎల్జీ పాలిమర్స్ జీఎం  

ప్రమాదానికి కారణమైన స్టైరిన్ లిక్విడ్ గడ్డకట్టి పాలిమర్ అయిందని, దీని నుంచి ఎలాంటి వాయువు బయటకు రావడం లేదని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ జీఎం మోహన్ రావు స్పష్టం చేశారు. ప్రమాదం సంభవించిన ట్యాంకు కాకుండా కంపెనీలో 2, విశాఖపోర్టులో 2 స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయని, ఈ ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ ట్యాంకుల్లో ఉన్న స్టైరిన్ లిక్విడ్ ను వెనక్కి పంపే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.

Minister
Avanthi Srinivas
Visakha LG Polymers
GM
Mohanrao
  • Loading...

More Telugu News