Pilots: చైనా వెళ్లొచ్చిన ఐదుగురు ఎయిరిండియా పైలట్లకు కరోనా పాజిటివ్

Air India pilots tested corona positive

  • గ్వాంగ్ జౌ నగరానికి రవాణా విమానాలు నడిపిన ఎయిరిండియా
  • పైలట్లు చైనాలో కరోనాకు గురై ఉంటారని అంచనా
  • ఇతర పైలట్లలో ఆందోళన

ఎయిరిండియా విమానయాన సంస్థకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే ఆ పైలట్లు ఓ రవాణా విమానంలో చైనాలోని గ్వాంగ్ జౌ వెళ్లొచ్చారు. లాక్ డౌన్ ప్రకటించాక ఎయిరిండియా అనేక అంతర్జాతీయ గమ్యస్థానాలకు కార్గో విమానాలు నడిపింది. ఔషధాలు, ఇతర వైద్య ఉపకరణాల కోసం ఇటీవలే ఢిల్లీ నుంచి చైనాలోని గ్వాంగ్ జౌ నగరానికి పలు విమాన సర్వీసులు నిర్వహించింది. ఈ పైలట్లకు కూడా చైనాలోనే కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.

కాగా, ఎయిరిండియా పైలట్లకు కరోనా సోకిందన్న వార్తతో ఇతర పైలట్లలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వందేభారత్ మిషన్ లో భాగంగా భారత్ పెద్ద సంఖ్యలో విమానాలను విదేశాలకు పంపుతోంది. విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది. కరోనా అత్యంత తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్న న్యూయార్క్ కు కూడా భారత విమానాలు వెళ్లాయి. అయితే, విమానం ఎక్కే ముందు, ప్రయాణం పూర్తయిన తర్వాత తమ పైలట్లకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్టు ఎయిరిండియా పేర్కొంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News