Nara Lokesh: ప్రపంచమంతా మాతృ దినోత్సవం జరుపుకుంటోంది.. కానీ, ఏపీ ప్రజలు మాత్రం..!: నారా లోకేశ్

lokesh on mothers day

  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఉత్సవాన్ని జరుపుకునే ఉత్సాహంతో లేరు
  • కారణం విశాఖ దుర్ఘటన
  • కళ్లముందే కనుపాపలు కనుమూస్తుంటే ఏమీ చేయలేకపోయారు
  • ఆ తల్లులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ పలు వ్యాఖ్యలు చేశారు. 'ప్రపంచం అంతా ఈ రోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం జరుపుకుంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఉత్సవాన్ని జరుపుకునే ఉత్సాహంతో లేరు. కారణం విశాఖ దుర్ఘటనలో కళ్లముందే కనుపాపలు కనుమూస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లులు ఉండిపోవాల్సి వచ్చింది' అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
'ఇలాంటి ఉపద్రవాలు ఇకపై జరగవని ప్రతి తల్లికీ భరోసా అందిన రోజే రాష్ట్రంలో నిజమైన మాతృదినోత్సవం జరుపుకుంటారు ప్రజలు. తమ పిల్లలను కోల్పోయిన బాధనుండి ఆ తల్లులు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని లోకేశ్ ట్వీట్లు చేశారు.

Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Vizag Gas Leak
  • Loading...

More Telugu News