Nagachaitanya: 'లవ్ స్టోరీ' నుంచి సాయిపల్లవి స్పెషల్ పోస్టర్

Love Story Movie

  • శేఖర్ కమ్ముల నుంచి 'లవ్ స్టోరీ'
  • మరోసారి సందడి చేయనున్న సాయిపల్లవి
  •  త్వరలో విడుదలకి సన్నాహాలు  

సున్నితమైన ప్రేమకథలను తెరపై అందంగా ఆవిష్కరించడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. ప్రేమ కథలకు సంబంధించినంతవరకూ ఆయన అల్లికను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు .. వీలైనంతవరకూ విజయాన్ని కట్టబెడుతుంటారు. అలాంటి శేఖర్ కమ్ముల తాజా చిత్రంగా 'లవ్ స్టోరీ' రూపొందింది.

నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాను, లాక్ డౌన్ తరువాత విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సాయిపల్లవి స్పెషల్ పోస్టర్ ను వదిలారు. ఈ రోజున సాయిపల్లవి పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా టీమ్ ఆమెకి శుభాకాంక్షలు అందజేస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వర్షంలో సాయిపల్లవి డాన్స్ కి సంబంధించిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ముల .. సాయిపల్లవి కలిసి చేసిన ఈ సినిమాపై భారీగానే అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.

Nagachaitanya
Sai Pallavi
Sekhar Kammula Movie
  • Loading...

More Telugu News