JP Nadda: అమిత్ షా ఆరోగ్యం బాగాలేదంటూ దుష్ప్రచారం చేయడం అమానవీయం: జేపీ నడ్డా

JP Nadda condemns rumors about Amith Shah health
  • పనిగట్టుకుని పుకార్లు వ్యాపింపచేస్తున్నారని ఆగ్రహం
  • ఈ పుకార్లను ఖండిస్తున్నట్టు వెల్లడి
  • దేవుడే వాళ్లకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ వ్యాఖ్యలు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యం సరిగాలేదంటూ కొందరు వ్యక్తులు పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. అమిత్ షా ఆరోగ్యంపై వస్తున్న ఇలాంటి అమానవీయ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఓ వ్యక్తి ఆరోగ్యంపై ఈ విధంగా పుకార్లు వ్యాపింపజేస్తున్న వారి ఆలోచన సరళి ఎలాంటిదో ఈ వ్యాఖ్యలతోనే అర్ధమవుతోందని అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యక్తులకు దేవుడే జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
JP Nadda
Amit Shah
Rumors
Health
BJP
India

More Telugu News