Pawan Kalyan: ఆయన నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందనిపిస్తుంది: వెంకయ్యనాయుడుకి పవన్ కితాబు

Pawan Kakyan describes Venkaiah Naidu

  • వెంకయ్యనాయుడిపై పవన్ ట్వీట్
  • మొక్కవోని వ్యక్తిత్వం అంటూ ప్రశంసలు
  • నిర్భయంగా మాట్లాడతారంటూ కితాబు

నిన్న బండారు దత్తాత్రేయ వ్యక్తిత్వాన్ని వర్ణించిన జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ వెంకయ్యనాయుడ్ని ఎంచుకున్నారు. మొక్కవోని వ్యక్తిత్వం, విలక్షణ రాజకీయ జీవితం, అమ్మభాషపై అమితమైన మక్కువ, చతురత నిండిన మాటలు ఆయన సొంతం, ఆయనెవరో కాదు గౌరవనీయ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు అంటూ ట్వీట్ చేశారు. ఏ విషయంలోనైనా నిర్భయంగా, మొహమాటం లేకుండా మాట్లాడడం వెంకయ్యనాయుడు నైజం అని, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తుందని తెలిపారు. ప్రభావవంతమైన ఆయన సలహాలు, సూచనలు సర్వదా ఆచరణీయాలని, ఆయనకు వినయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Pawan Kalyan
Venkaiah Naidu
Janasena
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News