Deepika Chikhaliya: సరోజినీ నాయుడు బయోపిక్ లో బుల్లితెర సీత .. ఫస్టులుక్ రిలీజ్

Deepika Chikhaliya

  • సీతగా విపరీతమైన క్రేజ్
  • సరోజినీ బయోపిక్ కి సన్నాహాలు
  • లాక్ డౌన్ తరువాత రెగ్యులర్ షూటింగ్  

చాలాకాలం క్రితం ప్రసారమైన రామానంద సాగర్ 'రామాయణం'  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.  మళ్లీ ఇంతకాలానికి .. లాక్ డౌన్ వేళలో పునః ప్రసారం చేస్తున్నారు. గతంలో కంటే ఎక్కువ ఆదరణ ఇప్పుడు లభిస్తుండటం విశేషం. 'సీత' పాత్రలో ఒదిగిపోయిన దీపిక చిఖలియా పేరు మళ్లీ జనం నోళ్లలో నానుతోంది. ఈ ధారావాహికను పునః ప్రసారం చేయడం ఆమెకి బాగా కలిసొచ్చింది.

ఆమెకి గల క్రేజ్ ఇప్పుడు ఒక భారీ అవకాశాన్ని తెచ్చిపెట్టింది. హిందీలో 'సరోజినీ నాయుడు' జీవిత చరిత్రగా రూపొందే 'సరోజిని' చిత్రంలో ఆమెకు టైటిల్ రోల్ పోషించే ఛాన్స్ వచ్చింది. కాను భాయ్ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి,  ఆకాశ్ నాయక్ - ధీరజ్ మిశ్రా దర్శకులుగా వ్యవహరించనున్నారు. లాక్ డౌన్ ను తొలగించిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. ఈ రోజున ఆ సినిమా నుంచి 'సరోజినీ నాయుడు' గా దీపిక చిఖలియా ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు.  ఈ పోస్టర్లో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Deepika Chikhaliya
Sarojini Naidu
Bollywood
  • Loading...

More Telugu News