Chiranjeevi: మల్టీ స్టారర్ మూవీలో మెగాస్టార్?

Chiranjeevi to act in multi starer movie
  • టాలీవుడ్ లో మల్టీ స్టారర్ల హవా
  • చిరు, రానాలతో మల్టీస్టారర్ మూవీ
  • ఇప్పటికే మల్టీస్టారర్లలో మెరిసిన సీనియర్ నటులు
టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్ లతో కలిసి మల్టీస్టారర్లలో వెంకటేశ్ మెరిశారు. మంచు మనోజ్ చిత్రంలో బాలయ్య కనిపించి అదరహో అనిపించారు. నానితో కలిసి నాగార్జున మురిపించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ప్రేక్షకులను మైమరపించబోతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి కూడా మల్టీస్టారర్ లో నటించబోతున్నారనేదే ఆ వార్త. యంగ్ హీరో దగ్గుబాటి రానాతో కలిసి నటించేందుకు మెగాస్టార్ సిద్ధమయ్యారని సమాచారం. సుజిత్ దర్శకత్వంలో 'లూసిఫిర్' రీమేక్ గా రూపొందే ఈ చిత్రంలో సెకండ్ హీరోగా రానా కనిపించనున్నాడు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'ఆచార్య'లో నటిస్తున్నారు. దాని తర్వాత ఈ చిత్రం సెట్స్ కి వెళుతుంది.
Chiranjeevi
Rana
Multi Starer
Tollywood

More Telugu News