Corona Virus: ముక్కు, నోరు కంటే.. కళ్ల ద్వారానే వేగంగా వ్యాపిస్తున్న కరోనా!

Corona virus spreading faster through eyes

  • కళ్లపై ఉన్న సన్నని పొరపై దాడి చేస్తున్న వైరస్
  • మనిషి గంటకు సరాసరి 16 సార్లు కంటిని టచ్ చేస్తాడు 
  • సార్స్ కంటే 100 రెట్లు వేగంగా కరోనా

కరోనా వైరస్ నేపథ్యంలో సురక్షిత చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. తద్వారా ఇతరుల నుంచి ముక్కు, నోటి ద్వారా తమకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, హాంకాంగ్ శాస్త్రవేత్తలు ఓ ఆందోళనకర విషయాన్ని వెల్లడించారు. ముక్కు, నోరు కంటే వేగంగా కళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని తెలిపారు.

కళ్లపై ఉన్న కంజంక్టివా అనే సన్నని పొరపై దాడి చేసి అక్కడి నుంచి శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్ వైరస్ కంటే 100 రెట్లు వేగంగా కరనా వైరస్ దాడి చేస్తున్నట్టు గుర్తించారు. ఒక అంచనా ప్రకారం మనిషి ప్రతి గంటకు 16 సార్లు కంటిని టచ్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో, కంటి ద్వారా వైరస్ వేగంగా వ్యాపిస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

  • Loading...

More Telugu News