Corona Virus: ఆక్సిజన్ థెరపీ.. 396 మంది కరోనా రోగులు రికవరీ!

396 corona patients recovered with Oxygen Therapy
  • భోపాల్ లోని చిరాయు ఆసుపత్రి వైద్యుల ఘనత
  • ఆక్సిజన్ థెరపీతో కరోనాకు చెక్
  • నిన్న కూడా 18 మంది పేషెంట్ల డిశ్చార్జ్
ఇండియాలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు నమోదవుతున్న సంఖ్య ఎక్కువగానే ఉంది. మరోవైపు, కరోనా పేషెంట్లకు చేస్తున్న చికిత్సలో మధ్యప్రదేశ్, భోపాల్ లో ఉన్న చిరాయు ఆసుపత్రి వైద్యులు సరికొత్త ఘనతను సాధించారు. ఆక్సిజన్ థెరపీ ద్వారా కరోనా రోగులకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ థెరపీ  ద్వారా ఇప్పటి వరకు 396 మందికి కరోనా నుంచి విముక్తి  కల్పించారు. నిన్న కూడా ఆసుపత్రి నుంచి 18 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు.

ఈ సందర్భంగా చిరాయు ఆసుపత్రి డైరెక్టర్ అజయ్ గోయెంకా మాట్లాడుతూ, కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన పేషెంట్లను ఇళ్లలో మరో 14 రోజుల పాటు క్వారంటైన్ లోనే ఉండాలని కోరుతున్నామని చెప్పారు. ఆ తర్వాత వీరంతా తమ ప్లాస్మాను డొనేట్ చేయాలని విన్నవిస్తున్నామని తెలిపారు.
Corona Virus
Oxygen Therapy
Chirayu Hospital
Bhopal
Madhya Pradesh

More Telugu News