Sai Pallavi: 'విరాట పర్వం' నుంచి సాయిపల్లవి లుక్

Virata Parvam Movie

  • వేణు ఊడుగుల దర్శకత్వంలో  'విరాటపర్వం'
  • నక్సలైట్ పాత్రలో సాయిపల్లవి
  • ప్రధానమైన పాత్రలో రానా

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. ఆమె సహజమైన నటన కారణంగా .. డాన్స్ కారణంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. కథాకథనాలు .. తన పాత్ర బాగుంటేనే అంగీకరించడం సాయిపల్లవి ప్రత్యేకత. ఈ కారణంగానే ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా వచ్చిన క్రేజ్ ఎక్కువ. చైతూ జోడీగా ఆమె చేసిన 'లవ్ స్టోరీ' .. రానా సరసన చేసిన 'విరాట పర్వం' విడుదలకి ముస్తాబవుతున్నాయి.

ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'విరాటపర్వం' యూనిట్ సభ్యులు శుభాకాంక్షలు అందజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్ గా నటించినట్టు తెలుస్తోంది. అందుకు తగినట్టుగానే విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు .. లగేజ్ తో అమరవీరుల స్థూపం దగ్గర సాయిపల్లవి ఎదురు చూస్తూ కూర్చుంది. ఈ పోస్టర్ తోనే సాయిపల్లవి పాత్ర ఎలా వుండనుందనే  అవగాహన కలుగుతోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు.
.

Sai Pallavi
Rana
Venu Udugula
  • Loading...

More Telugu News