Junior NTR: ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రశాంత్ నీల్ మూవీ ప్రకటన?

Prashanth Neel Movie

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ
  • సెట్స్ పైకి వెళ్లనున్న త్రివిక్రమ్ మూవీ
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్  

తెలుగులో మాస్ హీరోగా ఎన్టీఆర్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశలో వుంది. ఆ తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.  అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 'ఆర్ ఆర్ ఆర్' నుంచి ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను వదలనున్నట్టు తెలుస్తోంది.

ఇక త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో చేయనున్న 'అయినను పోయిరావలె హస్తినకు' సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను వదిలే అవకాశం కనిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమా తరువాత 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానున్నట్టుగా సమాచారం. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజున వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్టీఆర్ మాస్ లుక్ తో కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ సారి ఎన్టీఆర్ బర్త్ డే ఆయన అభిమానులకి పెద్ద పండగే.

Junior NTR
Trivikram Srinivas
Rajamouli
Prashanth Neel
  • Loading...

More Telugu News