Maoists: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఎస్సై, నలుగురు మావోయిస్టుల మృతి

4 Maoists gunned down in Chhattisgarhs Rajnandgaon

  • పర్దోనీ గ్రామ సమీపంలో గత రాత్రి ఎన్‌కౌంటర్
  • ఘటనా స్థలం నుంచి ఆయుధాల స్వాధీనం
  • కొనసాగుతున్న కూంబింగ్

చత్తీస్‌గఢ్‌లో నిన్న రాత్రి జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఎస్సై సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మాన్పూర్  పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో జరిగిందీ ఘటన. తమకు తారసపడిన పోలీసులపై మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఎస్సైతోపాటు నలుగురు మావోయిస్టులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్, రెండు 315 బోర్ రైఫిళ్లు, ఒక ఎస్ఎల్ఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్టు రాజ్‌నందగాన్ ఏఎస్పీ జీఎన్ బాఘెల్ తెలిపారు.

Maoists
Chhattisgarh
Rajnandgaon
Encounter
  • Loading...

More Telugu News