Rakul Preet Singh: సినీ విమర్శకుడు కమాల్ ఖాన్ ట్వీట్ కు కొంటెగా బదులిచ్చిన రకుల్ ప్రీత్

Rakul Preet gives a fitting reply to cine critic Kamaal Khan

  • ఓ దుకాణం నుంచి వస్తూ వీడియోకి చిక్కిన రకుల్
  • చేతిలో సీసాలు చూసి మద్యమేమో అనుకున్న కమాల్ ఖాన్
  • మెడికల్ షాపుల్లో మద్యం అమ్ముతున్నట్టు తెలియదని రకుల్ రిప్లయ్

అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ పరంగానే కాదు, మాటల పరంగానూ ఎంతో చురుకైనదాన్నని నిరూపించుకుంది. సినీ విమర్శకుడు కమాల్ ఖాన్ తనపై చేసిన సరదా ట్వీట్ కు అంతే కొంటెగా బదులిచ్చింది.

ఇటీవల సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ కు సంబంధించిన ఓ వీడియో దర్శనమిచ్చింది. ఓ దుకాణం నుంచి చేతిలో కొన్ని సీసాలు, కొన్ని ప్యాకెట్లతో వస్తూ అందులో ఆమె కనిపిస్తుంది. దీనిపై కమాల్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ, లాక్ డౌన్ సందర్భంగా రకుల్ ప్రీత్ ఏం కొనుగోలు చేసింది? మద్యం ఏమైనా కొనుగోలు చేసిందా? అంటూ ట్వీట్ చేశాడు.

దీనికి రకుల్ ప్రీత్ ఆసక్తికరంగా స్పందించింది. 'అయ్యో, మెడికల్ షాపుల్లో కూడా మద్యం అమ్ముతారని నాకు తెలియదే!' అంటూ బదులిచ్చింది. మొత్తానికి ఆ వీడియో, ఇరువురి ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News