Vande Bharat: ‘వందే భారత్’.. సింగపూర్ నుంచి ఢిల్లీ చేరుకున్న భారతీయులు!!

Vande Bharat flight Singapur to Delhi reaches
  • ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రత్యేక విమానం
  • సింగపూర్ నుంచి వచ్చిన 234 మంది భారతీయులు 
  • బంగ్లాదేశ్ నుంచి ఇవాళ బయలు దేరిన మరో ప్రత్యేక విమానం
‘కరోనా’, లాక్ డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా భారత్ కు రప్పించే ‘వందే భారత్’ మిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సింగపూర్ నుంచి 234 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఈ ప్రత్యేక విమానం ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అదేవిధంగా,  మొదటి విడతలో భాగంగా బంగ్లాదేశ్ నుంచి 168 మంది భారతీయులను మన దేశానికి తీసుకువస్తున్నారు. ఈ ప్రత్యేక విమానం ఇవాళ ఉదయం బయలు దేరిందని, నేరుగా శ్రీనగర్ లో ల్యాండ్ అవుతుందని సంబంధిత అధికారుల సమాచారం.
Vande Bharat
Singapur
New Delhi
special flight
Bangladesh

More Telugu News