Kamal Haasan: 'భారతీయుడు 2'పై పుకార్లు .. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Bharateeyudu 2 Movie

  • ఆటంకాలు ఎదురుకావడం సహజం
  • 60 శాతం చిత్రీకరణ పూర్తయింది
  •  పుకార్లను నమ్మొద్దన్న లైకా ప్రొడక్షన్స్  

ఏ ముహూర్తాన మొదలుపెట్టారోగానీ, 'భారతీయుడు 2' సినిమాకి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే వస్తున్నాయి. ఒక్కోసారి ఒక్కో కారణంగా ఈ సినిమా షూటింగు వాయిదాపడుతూ వస్తోంది.  తిరిగి షూటింగును ప్రారంభించడానికి కూడా చాలా సమయాన్ని తీసుకుంటూ ఉండటం విశేషం. ఇటీవల ఈ సినిమా షూటింగు సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా షూటింగును నిలిపేశారు. మొదటి నుంచి జరుగుతూ వస్తున్న సంఘటనల క్రమంలో ఈ ప్రాజెక్టును నిర్మాతలు ఆపేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ విషయంపై లైకా ప్రొడక్షన్స్ వారు స్పందించారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 60 శాతం వరకూ పూర్తయింది. మిగతా 40 శాతం చిత్రీకరణకి సంబంధించిన సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. లాక్ డౌన్ ను తొలగించిన తరువాత తిరిగి షూటింగు మొదలవుతుంది. చిత్రీకరణ ముగింపు దశకి చేరుకుంటూ ఉండగా, ప్రాజెక్టు ఆగిపోయిందంటూ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. కొన్ని ప్రాజెక్టుల విషయంలో సమస్యలు తలెత్తడం .. కొన్ని ఆటంకాలు ఏర్పడటం సహజం. అంత మాత్రానికే పుకార్లకు ప్రాణం పోయడం భావ్యం కాదు. ఎలాంటి పరిస్థితుల్లోను ఈ ప్రాజెక్టు ఆగదు" అంటూ నిర్మాతలు తమ వైపు నుంచి క్లారిటీ ఇచ్చేశారు.

Kamal Haasan
Kajal Agarwal
Rakul Preet Singh
Siddharth
  • Loading...

More Telugu News