LG Polymers: వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు

Case filed against LG Polymers management
  • ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గౌతమ్ రెడ్డి
  • ఒకటిన్నర కి.మీ. పరిధిలో ప్రభావం అధికంగా ఉందని వెల్లడి
  • గాల్లోకి నీటిని పిచికారీ చేసి ప్రభావాన్ని తగ్గించినట్టు వివరణ
వైజాగ్ నగరంలో తీవ్ర విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదైంది. వేకువ జామున ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి లీకైన విషవాయువు తీవ్ర ప్రభావం చూపింది. ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. గ్యాస్ లీకేజీకి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైందని వెల్లడించారు.

ప్రస్తుతం గ్యాస్ లీకేజీ నిలిచిపోయిందని, ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీటిని పిచికారి చేసి వాతావరణంలో విషవాయువు ప్రభావాన్ని నియంత్రించినట్టు మంత్రి వివరించారు. పరిశ్రమల శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషవాయువు ప్రభావం ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి ఒకటిన్నర కిలోమీటరు పరిధిలో అధికంగా ఉందని తెలిపారు.
LG Polymers
Vizag Gas Leak
Case
Mekapati Goutham Reddy
Andhra Pradesh

More Telugu News