Vizag: వైజాగ్ లో గ్యాస్ లీకేజ్ అదుపులోకి వచ్చింది: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

AP DGP Gowtham Sawang Statement

  •  సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి
  • ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు
  • ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో మరో ఇద్దరు చనిపోయారు

వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి విశాఖలోని పరిస్థితిని గమనిస్తున్నట్టు చెప్పారు. గ్యాస్ లీకేజ్ అదుపులోకి వచ్చిందని, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారని అన్నారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో మరో ఇద్దరు చనిపోయారని చెప్పారు.

ఎల్జీపాలిమర్స్ కంపెనీలో పని చేసే వర్కర్స్ అంతా ఆ పరిసరాల్లోనే ఉంటారని, వారిలో చాలా మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారని అన్నారు. లీకైన గ్యాస్ ను ఎక్కువ మొత్తంలో పీల్చిన వారికే ప్రమాదం ఉండే అవకాశం ఉందని అన్నారు. అయితే, ఈ గ్యాస్ అంత ప్రాణాంతకం కాదని, దీని కారణంగా అనారోగ్యానికి గురైన వారంతా వెంటనే డిశ్చార్జి అవుతారని భావిస్తున్నట్టు చెప్పారు.

Vizag
Gas Leakage
Andhra Pradesh
DGP
Gowtham sawang
  • Loading...

More Telugu News